BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం

Select Suryaa Now
అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం

అనుమసముద్రంపేట, మేజర్ న్యూస్ ఏఎస్ పేట మండలంలోని చిరమణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల అక్బరాబాద్ గ్రామంలో శుక్రవారం సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా చిరమణ పి హెచ్ సి వైద్యాధికారులు బి. జ్యోతి రాణి, కె. నాగ వినుత మాట్లాడుతూ, కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. రెండు వారాల నుంచి దగ్గుతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా గళ్ళ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆహారంలో ఉప్పు, నూనె, చక్కెర తక్కువగా వాడాలని సూచించారు. అలాగే గర్భిణీలకు బీపీ, షుగర్ వంటి పలు పరీక్షలు నిర్వహించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో హెచ్.ఈ.ఓ షేక్ షఫీ, సూపర్వైజర్ మంజుల, ఎంఎల్హెచ్పి పి. రమణమ్మ, ఫార్మసిస్ట్ ఎస్.డి. అబ్దుల్ ఖాదర్, ల్యాబ్ టెక్నీషియన్ ఎన్. ఝాన్సీ, ఏఎన్ఎంలు పి. హేమలత, ఎం. జ్యోష్ణ, ఎం. సుమతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు