BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

పెంబర్తిలో సైబర్ మోసాలపై బ్యాంక్ ఆఫ్ ఇండియా అవగాహన కార్యక్రమం

Select Suryaa Now
పెంబర్తిలో సైబర్ మోసాలపై బ్యాంక్ ఆఫ్ ఇండియా అవగాహన కార్యక్రమం

జనగామ ప్రతినిధి, మేజర్ న్యూస్, పెరుగుతున్న  ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ మన్నె శ్రీజ సూచించారు. జనగామ మండల పరిధిలోని పెంబర్తి గ్రామంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సైబర్ నేరాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మేనేజర్ శ్రీజ మాట్లాడుతూ.. బ్యాంకు అధికారులు ఎప్పుడూ ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు అడగరని స్పష్టం చేశారు. ప్రజలు తమ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఓటీపీ, డెబిట్ కార్డు పిన్, పాస్‌వర్డ్, యూపీఐ పిన్ వంటి రహస్య వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచిత వ్యక్తులతో పంచుకోవద్దని హెచ్చరించారు.ఇటీవల కాలంలో 'డిజిటల్ అరెస్టు' పేరుతో సైబర్ నేరగాళ్లు సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, అలాంటి నకిలీ ఫోన్ కాల్స్ లేదా వీడియో కాల్స్ వస్తే ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేఖ రాజు, బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది లక్ష్మీనారాయణ, హర్ష వర్ధన్ తో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రిపోర్టర్ ; నవీన్ చారి ,జనగామ జిల్లా