BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

దుర్గమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలి-మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Select Suryaa Now
దుర్గమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలి-మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

దేవరుప్పుల, మేజర్ న్యూస్, దేవరుప్పుల  మండలంలోని కడవెండి గ్రామంలో సంస్కార్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గా మాత నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు నిర్వహించిన వేడుకలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. జగన్మాత శ్రీ దుర్గా దేవి కరుణాకటాక్షాలు కడవెండి గ్రామ ప్రజలతో పాటు సంస్కార్ యూత్ సభ్యులందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి దీవెనలతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. భక్తిభావంతో నిర్వహించే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గ్రామ ప్రజలంతా పరస్పర ప్రేమాభిమానాలతో కలిసిమెలిసి ఉంటూ ఆధ్యాత్మిక సంప్రదాయాలను కాపాడుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాషిపాక రాములు, బీఆర్‌ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు తాటిపల్లి మహేష్, పార్టీ నాయకులు, సంస్కార్ యూత్ సభ్యులు, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్, ఎల్లేష్ ,దేవరుప్పుల, జనగామ జిల్లా