ఒక అవకాశం ఇస్తే 5వ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తా
మదనపల్లె,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా,మదనపల్లి పట్టణం,ఐదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థినిగా జనసేన పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జనసేన సీనియర్ మహిళా నాయకురాలు మల్లికా సిద్దు పేర్కొన్నారు.ఈ సందర్భంగా గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఐదవ వార్డు బీసీ మహిళకు (రిజర్వేషన్) కేటాయించారని బీసీ బిడ్డగా కౌన్సిలరుగా పోటీ చేసేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నానన్నారు.జనసేన అధినేత,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని,కౌన్సిలరుగా ఎంపికైతే ప్రజాసేవకు పునరంకితమవుతానన్నారు.తనకు జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ రాందాస్ చౌదరి,ఇతర నేతలు సహకరిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.ఇప్పటికే జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శిగా,మడికయ్యల శివాలయం డైరెక్టరుగా సమర్థవంతంగా పనిచేస్తున్న మల్లికకు కౌన్సిలరుగా అవకాశం ఇస్తే మరింత సేవ చేస్తారని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి