BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ బాలస్వామిరెడ్డి

Select Suryaa Now
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ బాలస్వామిరెడ్డి

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్: రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రొద్దుటూరు డీఎస్పీ ఈ. బాలస్వామి రెడ్డి, వన్‌టౌన్ సీఐ కొండారెడ్డి, ఎస్‌ఐ మధుసూదన్ రెడ్డితో కలిసి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలను సమీక్షించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

  • ఎ ప్రతాప్ కుమార్ ప్రొద్దుటూరు అర్బన్ వైఎస్సార్ కడప జిల్లా