BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

కూటమి ధర్మాన్ని పాటించాలి.. పార్టీ ఆదేశాల మేరకే అభ్యర్థుల ఎంపిక: ఎమ్మెల్యే గిడ్డి

Select Suryaa Now
కూటమి ధర్మాన్ని పాటించాలి.. పార్టీ ఆదేశాల మేరకే అభ్యర్థుల ఎంపిక: ఎమ్మెల్యే గిడ్డి

పి. గన్నవరం మేజర్ న్యూస్ :పి. గన్నవరం మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు  గిడ్డి సత్యనారాయణ  హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ కూటమి ధర్మాన్ని పాటించాలని, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ అధిష్ఠానం నుంచి వచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని సూచించారు. 

ఎవరూ స్వతంత్రంగా అభ్యర్థులను ప్రకటించకుండా, పార్టీ నిర్ణయం మేరకు ఎంపికైన అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం విజయ లక్ష్యంతో ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని, పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు పూర్తి మద్దతు అందించాలని అన్నారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్తలు, నిర్వాహక దళ్ సభ్యులు, కమిటీ ప్రతినిధులు తమ అభిప్రాయాలను ఎమ్మెల్యే కు వివరించారు. సమావేశంలో చర్చించిన అంశాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే  వారికి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు, నిర్వాహక దళ్ సభ్యులు, సపోర్టింగ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.