మెడ్యునైటెడ్ హాస్పిటల్స్లో అడ్వాన్స్డ్ ఎమర్జెన్సీ,ట్రామా కేర్ సెంటర్ ప్రారంభం..
అమలాపురం మేజర్ న్యూస్ ప్రజలకు మరింత మెరుగైన అత్యవసర వైద్య సేవలను అందించే లక్ష్యంతో మెడ్యునైటెడ్ హాస్పిటల్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ ఎమర్జెన్సీ & ట్రామా కేర్ సెంటర్ను గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మెడ్యునైటెడ్ హాస్పిటల్స్ అందిస్తున్న వైద్య సేవలు, అత్యవసర వైద్య విభాగం ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండటంలో ఇటువంటి అధునాతన ఎమర్జెన్సీ & ట్రామా కేర్ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అముడా చైర్మన్ శ్రీ అల్లాడ స్వామినాయుడు శ్రీ కర్రి దత్తుడు , విజయ్ గారు, ప్రతినిధి శ్రీ సురేష్ గారు, పార్వతి, గుమ్మళ్ల శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పాల్గొన్న వైద్య నిపుణులు :మెడ్యునైటెడ్ హాస్పిటల్స్కు చెందిన డా. రాజీవ్, డా. సురేంద్ర, డా. ప్రణీత్ ఎమర్జెన్సీ ఫిజీషియన్లు, డా. అశోక్ జనరల్ మెడిసిన్ డా. రఘువీర కార్డియాలజిస్ట్ డా. రామ్ అభిషేక్, డా. హరి ప్రియ న్యూరో ఫిజీషియన్లు డా. కిషోర్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, డా. సుధీర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్), డా. లహరి, డా. సునీల్ కుమార్ తదితర వైద్యులు పాల్గొన్నారు.
ప్రాణాపాయ పరిస్థితుల్లో సకాలంలో చికిత్సే ప్రాణరక్షణ!
ఈ అడ్వాన్స్డ్ ఎమర్జెన్సీ & ట్రామా కేర్ సెంటర్ ద్వారా ప్రమాదాలు, గుండె సంబంధిత అత్యవసర సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్తో పాటు ఇతర క్లిష్టమైన వైద్య పరిస్థితుల్లో రోగులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అమలాపురం మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, అత్యవసర సమయాల్లో త్వరితగతిన చికిత్స అందించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని తెలిపారు