వంగపల్లి గ్రామ యువకుడి హత్య......
మద్దూర్…మద్దూరు మండలంలోని వంగపల్లి గ్రామానికి చెందిన బొడికే ప్రేమ్ కుమార్ యువకుడు రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి హత్యకు గురయ్యాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామపంచాయతీలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న బోడికే లలిత కుమారుడు ప్రేమ్ కుమార్ కొత్తూరు లోని ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రాత్రి తన స్నేహితులతో కలిసి ఈగాపూర్ గ్రామంలోని ఓ వెంచర్ లో మద్యం సేవిస్తూ ఉండగా వారి మధ్య ఘర్షణ ఏర్పడి ప్రేమ్ కుమార్ ను తోటి స్నేహితులే కత్తులతో హత్య చేసినట్లు తెలిపారు. గురువారం ప్రేమ్ కుమార్ మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.