గణేష్ నిమజ్జన సేవలకు గుర్తింపు సీపీ చేతుల మీదుగా భాను ప్రకాశ్కు సన్మానం
కోహెడ ; కోహెడ మండలంలోని గుండారెడ్డిపల్లి గ్రామం బ్రాంచ్ పోస్ట్మాస్టర్ గొట్టె భాను ప్రకాశ్ ఉత్తమ ప్రతిభకు గుర్తింపు హైదరాబాద్లోని ఖైరతాబాద్ ట్యాంక్ బండ్ వద్ద సెప్టెంబర్లో నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పోలీస్ వాలంటీర్గా సేవలందించిన గుండారెడ్డిపల్లి బ్రాంచ్ పోస్ట్మాస్టర్ గొట్టె భాను ప్రకాశ్ ఉత్తమ ప్రతిభకు గుర్తింపుగా పోలీస్ కమిషనర్ (సీపీ) చేతుల మీదుగా సన్మానం అందుకున్నారు. కార్యక్రమంలో బాధ్యతాయుతంగా సేవలందించినందుకు ఆయనకు ఈ గుర్తింపు లభించింది. భాను ప్రకాష్ తండ్రి గొట్టె నర్సయ్య కుమారుడు. గ్రామానికి చెందిన వ్యక్తికి ప్రశంసలు లభించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.