లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ
మద్దూరు…మద్దూరు మండలంలోని లక్క పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ జక్కుల కనకమ్మ లింగయ్య అధ్యక్షతనగా భూ సర్వే, రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించేందుకు గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ ఏజీ రహీం మాట్లాడుతూ మండలంలో ప్రస్తుత లక్క పల్లి, ధర్మారం, నర్సాయపల్లి గ్రామాలను ఎంపిక చేసుకొని సర్వే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సర్వే అనంతపురం రైతుల వివరాలు భూధా ర్ కు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. బాగు చేస్తున్న భూములకు యూనిక్ నెంబర్ అందించడం జరుగుతుందన్నారు. అన్ని రకాల భూముల లెక్కలు ఈ సర్వే ద్వారా లభించనున్నట్లు తెలిపారు. భూ సర్వే పై రైతులు ఎలాంటి ఆపోహలకు గురికా వద్దన్నారు. ఈ సమావేశంలో ఉపసర్పంచ్ బొల్లం శ్యాంసుందర్, డిఐ బాలయ్య, ఆర్ఐ కృష్ణ, మండల సర్వేయర్ గంగాధర్, జిపిఓ రాజేందర్, పంచాయతీ కార్యదర్శి మహేందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.