BREAKING
సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ ఐసీసీ నిబంధనల ఉల్లంఘన.. ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ అఫ్సర్‌పై అధికారిక మందలింపు! గణేష్ నిమజ్జన సేవలకు గుర్తింపు సీపీ చేతుల మీదుగా భాను ప్రకాశ్‌కు సన్మానం

అగ్రీగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేవరకు విశ్రమించం

Select Suryaa Now
అగ్రీగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేవరకు విశ్రమించం

అగ్రీగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేవరకు విశ్రమించం
- సంస్థ ఆస్తులమ్మి బాధితులకు చెల్లింపులు చేపట్టాలి
-ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

కొత్తగూడెం ఆర్ సీ, సూర్య(మేజర్ న్యూస్) - అగ్రీగోల్డ్ బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగేంతవరకు ఉద్యమ పోరాటాలు కొనసాగిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయం శేషగిరిభవన్ లో గురువారం జిల్లాస్థాయి అగ్రీగోల్డ్ బాధితుల విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రెక్కాడితేగానీ డొక్కాడని చిరువ్యాపారులు, రైతులు, పేదలు తమ కష్టార్జితాన్ని పొదుపు చేసుకుంటే ఆ సంస్థ నిలువునా మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఏళ్లు గడుస్తున్నా బాధితులకు చిల్లిగవ్వ అందకపోవడం దుర్మార్గమని విమర్శించారు. లక్షలాది మంది పేద కుటుంబాలు, ఏజెంట్లు రోడ్డున పడి తీవ్ర మానసిక క్షోభతో ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వాలు చోద్యం చూడడం భావ్యం కాదన్నారు. సంస్థకు సంబంధించిన వేల కోట్ల విలువైన ఆస్తులను వెంటనే వేలం వేసి బాధితులకు సత్వరమే పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితుల సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అగ్రీగోల్డ్ యాజమాన్యం బినామీ పేర్లతో దాచిపెట్టిన సమస్త ఆస్తులను గుర్తించి తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అగ్రీగోల్డ్ కంపెనీ మోసాలను తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడిన బాధితులు, ఏజెంట్ల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధితుల పక్షాన అసెంబ్లీలో గళమెత్తడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పూర్తి న్యాయం దక్కేలా ఉద్యమిస్తామని భరోసా ఇచ్చారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు వీసంశెట్టి పూర్ణచందర్ రావు, రైతుసంఘం జిల్లా నాయకులూ వై ఎస్ గిరి, తెలంగాణ అగ్రీగోల్డ్ బాధితుల సంఘం నాయకులు, బాధితులు, ఏజెంట్లు పాల్గొన్నారు.