చలో హైదరాబాద్ విజయవంతం చేయండి
మహబూబాబాద్ ప్రతినిధి, మేజర్ న్యూస్,ఈనెల 26న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు కోశాధికారి వంగూరి రాములు పిలుపునిచ్చారు.గురువారం మల్టిపుల్ డేస్ మహా ధర్నాను జయప్రదం కోసం వాల్ పోస్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని సుమారు రెండు కోట్ల మంది సంఘటిత, అసంఘటిత కార్మిక వర్గం కదం తోక్కవలసిన తరుణం ఆసన్నమైందని అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించడంలో విఫలం అయ్యారని అన్నారు .కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ మన హక్కులను కాలరాస్తున్నారధి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి, ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తున్నదని ఆవేధన వ్యక్తం చేశారు.కనీస వేతనం పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచకుండా కార్మికుల శ్రమను దోచుకోవడానికి పెట్టుబడిదారీ వర్గానికి స్వేచ్ఛనిచ్చిందని ఆరోపించారు. కేంద్ర కనీస వేతనాల సలహా మండలిలో కేంద్ర కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వకుండా ప్రభుత్వ అనుకూల సంఘాలకు అవకాశం కల్పించిందని, ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ మీటింగ్ జరపడం లేదన్నారు.స్కీము వర్కర్స్ ను కార్మికులుగా గుర్తించడం లేదు 12 సంవత్సరాలలో 25 లక్షల కోట్లు ప్రజాధనాన్ని పారిశ్రామికవేత్తలకు దారపోసిందన్నారు.కార్మిక ఉద్యమాల పట్ల ఉక్కు పాదం మోపుతున్నదని అన్నారు .కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు .రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మిక హక్కులు సమస్యల పరిష్కరించడంలో బిజెపి అడుగుజాడల్లో నడుస్తున్నదన్నారు. నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకించకుండా వాటిని రూల్స్ రూపొందించి అమలు చేయాలని ఉవిలురూ తున్నదని ఎద్దేవా చేశారు.అంగన్వాడి .ఆశ మధ్యన భోజనం ఐకెపి ఫీల్డ్ అసిస్టెంట్లు ట్రాన్స్పోర్ట్ భవన నిర్మాణం హమాలి ఆర్టీసీ వంటి అన్ని రంగాల వారికి జీతభత్యాలు పెంచుతామని ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలో వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటింది పైగా ఆందోళనలు పోరాటాల పట్ల నిర్బంధం ప్రయోగిస్తున్నదని, ఈ నేపథ్యంలో అన్ని రంగాల కార్మికులు ఏకమై కార్మిక వర్గ సంఘటితశక్తిని ప్రదర్శించాలని అన్నారు .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి మన హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి,జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి కుంట్ల నాగన్న,సహాయ కార్యదర్శులు దుండి వీరన్న,మల్లయ్య ,అంగన్వాడి జిల్లా కార్యదర్శి గుండు సులోచన, భవన నిర్మాణ సంఘం కార్యదర్శి తాడబోయిన శ్రీశైలం,ఆశ అధ్యక్ష కార్యదర్శులు సుజాత,సుజిత. కోశాధికారి రేణుక, ఉపాధ్యక్షురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: గొడుగు శ్రీనివాస్, మహబూబాబాద్