బతుకమ్మ ఘాట్ వద్ద ఏర్పాట్ల పరిశీలన
బతుకమ్మ ఘాట్ వద్ద ఏర్పాట్ల పరిశీలన
లక్ష్మీదేవిపల్లి, సూర్య(మేజర్ న్యూస్)- సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో శ్రీనగర్ బతుకమ్మ ఘాట్ వద్ద ఏర్పాట్లను ఎంపీడీవో సుస్మిత, బతుకమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్ కోనేరు పూర్ణ చందర్ రావు పరిశీలించారు.ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ రాణి, శ్రీనగర్ మాజీ ఉప సర్పంచ్, వార్డు సభ్యుడు లగడపాటి రమేష్ చంద్తో కలిసి ముర్రేడు వాగు పరిసర ప్రాంతాలను పరిశీలించారు.సద్దుల బతుకమ్మ నాడు పెద్ద ఎత్తున తరలివచ్చే మహిళా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శ్రీనగర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం, ఉత్సవ కమిటీ సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఎంపీడీవో సూచించారు.వివిధ గ్రామ పంచాయతీల సిబ్బంది, గ్రామ కార్యదర్శులు కూడా బతుకమ్మ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటారని, ముర్రేడు వాగు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ సాంబయ్య, శ్రీనగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.