ఆర్సీహెచ్పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ
ఆర్సీహెచ్పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ
- అన్నదాన కార్యక్రమం
- హాజరైనా ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, నాయకులు
కొత్తగూడెం సింగరేణి, సూర్య(మేజర్ న్యూస్)- సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (ఆర్సీహెచ్పీ)లో శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుగుతున్నాయి.
తొమ్మిది రోజుల పాటు జగన్మాతకు నిత్య పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తుండగా, ప్లాంట్ ఆవరణలో నారాయణ సేవ - అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు.ఆర్సీహెచ్పీ హెచ్ఓడీ లింగ ఆధ్వర్యంలో జరిగిన ఈ అన్నదాన కార్యక్రమానికి ఐఎన్టీయూసీ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, ఐఎన్టీయూసీ నాయకులతో కలిసి హాజరై పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎండి రజాక్ మాట్లాడుతూ దసరా నవరాత్రుల వేళ తోటి కార్మికులు, ప్రజల క్షేమం కోసం ఇలాంటి ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అన్నదానం అన్ని దానాల్లోకెల్లా మహత్తరమైనదని, కార్మికులంతా ఐక్యమత్యంతో పండుగలు జరుపుకుంటూ సంస్థ అభివృద్ధికి, ఉత్పత్తి సాధనకు పాటుపడాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు సకినాల సమ్మయ్య, పోశం శ్రీనివాస్, భీముడు, కాసర్ల సమ్మయ్య, డి శంకర్ బాబు, ఎండి సత్తార్ పాషా, ఈ మోహన్ రెడ్డి, కే కుమార్, క్రాంతి కుమార్, కిరణ్, రాధాకృష్ణ, నీలం సమ్మయ్య, సుబ్బరాజు, జనార్ధన్, నరసింహారావు మంతెన, రమేష్ బోలిశెట్టి, కార్మిక ప్రతినిధులు, ఆర్సీహెచ్పీ అధికారులు, సిబ్బంది, డీఎల్ఆర్ కార్మికులు, ఆల్ ట్రేడ్ అప్రెంటిస్లు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు.