అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు.. 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు..
(అనంతపురము, కార్పొరేషన్ మేజర్ న్యూస్:)
అనంతపురం నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికలు–2026కు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ను కమిషనర్ ఎం. జశ్వంత్ రావు వెల్లడించారు. అక్టోబర్ 16 నుంచి 18వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. 19న నామినేషన్ల పరిశీలన, 21న ఉపసంహరణ, 28న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, 30న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
నగరంలోని 62 డివిజన్లకు 245 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, నగరపాలక సంస్థ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశామని, అభ్యర్థులు తమ డివిజన్కు కేటాయించిన రిటర్నింగ్ అధికారి వద్దే నామినేషన్లు దాఖలు చేయాలని కమిషనర్ సూచించారు.