BREAKING
సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ ఐసీసీ నిబంధనల ఉల్లంఘన.. ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ అఫ్సర్‌పై అధికారిక మందలింపు! గణేష్ నిమజ్జన సేవలకు గుర్తింపు సీపీ చేతుల మీదుగా భాను ప్రకాశ్‌కు సన్మానం

86వ డివిజన్ కండ్రికలో బొండా సిద్ధార్థ ఇంటింటి ప్రచారం

Select Suryaa Now
86వ డివిజన్ కండ్రికలో బొండా సిద్ధార్థ ఇంటింటి ప్రచారం

విజయవాడ మేజర్ న్యూస్ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 86వ డివిజన్ కండ్రిక రామాలయం వద్ద గురువారం తెలుగుదేశం పార్టీ  యువ నాయకుడు బొండా సిద్ధార్థ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నాయకత్వంలో సెంట్రల్ నియోజకవర్గంలోని 29 డివిజన్లలో తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి బలోపేతానికి సమష్టిగా కృషి  చేస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, సంక్షేమ పథకాల ద్వారా అర్హులకు అందుతున్న ప్రయోజనాలను ఇంటింటికీ వెళ్లి వివరిస్తున్నామని చెప్పారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకోవడం, స్థానిక సమస్యలను సంబంధిత నాయకుల దృష్టికి తీసుకెళ్లడం ప్రచార కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమంలో కాకొల్లు వరలక్ష్మి, కాకొల్లు సాయి హర్ష, కాకొల్లు ఝాన్సీ, కాకొల్లు సాయి చరణ్, ఎస్.కె. బాబు, కోమారి రాజేష్, కోరాడ రమణ, బాబు, తిరుపతయ్య, రమణ, సూర్యనారాయణ, ఖాజా, రాజు తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.