BREAKING
సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ ఐసీసీ నిబంధనల ఉల్లంఘన.. ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ అఫ్సర్‌పై అధికారిక మందలింపు! గణేష్ నిమజ్జన సేవలకు గుర్తింపు సీపీ చేతుల మీదుగా భాను ప్రకాశ్‌కు సన్మానం

ఎన్నికల నియమావళి అమలులో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు

Select Suryaa Now
ఎన్నికల నియమావళి అమలులో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు

విజయవాడ కార్పొరేషన్ మేజర్ న్యూస్: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని, విధుల్లో అలసత్వం వహించే అధికారులు, సిబ్బందిపై సస్పెన్షన్‌తో సహా కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్చరించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గురువారం ఎన్నికల విధుల నిర్వహణ, నియమావళి అమలుపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయడం, రాజకీయ పోస్టర్లు, బ్యానర్లు, ప్రచార సామగ్రిని నిబంధనల ప్రకారం తొలగించడం వంటి చర్యలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల విధులకు కేటాయించిన అధికారులు, సిబ్బంది తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని, క్షేత్రస్థాయిలో చేపట్టిన చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో వర్తించే 100 మీటర్ల నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని, ఎన్నికల ప్రచార నిబంధనల ఉల్లంఘనలు జరగకుండా నిఘా ఉంచాలని ఆదేశించారు. ఉల్లంఘనలు గుర్తించిన వెంటనే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల విధుల నిర్వహణలో వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, అప్పగించిన పనులను గడువులోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తూనే ప్రజలకు అందించే సాధారణ పౌర సేవలు, రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా చూడాలని కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు, సిబ్బంది పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.