BREAKING
సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ ఐసీసీ నిబంధనల ఉల్లంఘన.. ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ అఫ్సర్‌పై అధికారిక మందలింపు! గణేష్ నిమజ్జన సేవలకు గుర్తింపు సీపీ చేతుల మీదుగా భాను ప్రకాశ్‌కు సన్మానం

వ్యర్థజలాల శుద్ధి కేంద్రం త్వరగా అందుబాటులోకి తేవాలి : ఏపీపీసీబీ ఛైర్మన్ డా. పి. కృష్ణయ్య

Select Suryaa Now
వ్యర్థజలాల శుద్ధి కేంద్రం త్వరగా అందుబాటులోకి తేవాలి : ఏపీపీసీబీ ఛైర్మన్ డా. పి. కృష్ణయ్య

మచిలీపట్నం మేజర్ న్యూస్: మచిలీపట్నం సమీపంలోని పోతేపల్లి జువెలరీ పార్క్‌లో నిర్మిస్తున్న ఉమ్మడి వ్యర్థజలాల శుద్ధి కేంద్రాన్ని త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ డా. పి. కృష్ణయ్య ఆదేశించారు. విజయవాడలోని మండలి ప్రధాన కార్యాలయంలో గురువారం జువెలరీ పార్క్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో శుద్ధి కేంద్రం ఆధునికీకరణ పనులు, ఎంవీఆర్ సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్న పనుల పురోగతి, నిర్వహణ అంశాలపై సమీక్షించారు. జువెలరీ పార్క్‌లోని బంగారు పూత యూనిట్ల నుంచి వెలువడే వ్యర్థజలాలను తప్పనిసరిగా ఉమ్మడి వ్యర్థజలాల శుద్ధి కేంద్రానికి తరలించి, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా శుద్ధి చేయాలని స్పష్టం చేశారు. శుద్ధి చేయని వ్యర్థజలాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు విడుదల చేయరాదని, పర్యావరణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుద్ధి కేంద్రం నిరంతరం సమర్థవంతంగా పనిచేసేలా అవసరమైన చర్యలు చేపట్టాలని, పారిశ్రామిక కార్యకలాపాల వల్ల పర్యావరణానికి హాని కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జువెలరీ పార్క్ ప్రతినిధులు తమవంతుగా చేపట్టాల్సిన పనులన్నీ పూర్తయ్యాయని, శుద్ధి కేంద్రాన్ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఛైర్మన్‌కు వివరించారు. సమావేశంలో విజయవాడ ప్రాంతీయ కార్యాలయ ఇంజినీర్ శ్రీనివాస్, మచిలీపట్నం జువెలరీ పార్క్ మెంబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

 

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.