BREAKING
సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ ఐసీసీ నిబంధనల ఉల్లంఘన.. ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ అఫ్సర్‌పై అధికారిక మందలింపు! గణేష్ నిమజ్జన సేవలకు గుర్తింపు సీపీ చేతుల మీదుగా భాను ప్రకాశ్‌కు సన్మానం

ఇంద్రకీలాద్రిపై అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా దర్శనం.. కొండదిగువన భక్తి సంగీతం, నృత్య ప్రదర్శనలు

Select Suryaa Now
ఇంద్రకీలాద్రిపై అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా దర్శనం.. కొండదిగువన భక్తి సంగీతం, నృత్య ప్రదర్శనలు

ఇంద్రకీలాద్రి మేజర్ న్యూస్ : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ కనకదుర్గా నగర్‌లోని ప్రత్యేక కళావేదికపై సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమివ్వగా, కొండదిగువన భజన కీర్తనలు, భక్తి గీతాలు, హరికథా గానం, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన కళార్చనలో కళాకారులు తమ ప్రదర్శనలతో భక్తులను భక్తిభావంలో ముంచెత్తారు. బి. సువర్ణకుమారి బృందం సంప్రదాయ తాళ భజనతో కార్యక్రమాలను ప్రారంభించగా, జి. నాగేశ్వరశర్మ, పి.హెచ్.ఎస్. మణికంఠ, ఎం. నాగ సునీత, పి.వి.ఎన్. కామేశ్వరి ఆలపించిన భక్తి సంకీర్తనలు, దేవీ స్తోత్రాలు భక్తులను ఆకట్టుకున్నాయి. హరికథా భాగవతార్ జె. సుధాకర్ భక్త మార్కండేయుని చరిత్రను హరికథా గానం, అభినయంతో వివరించి భక్తులను అలరించారు. అనంతరం చిన్నారులు, యువ కళాకారులు కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలతో అమ్మవారికి నృత్య నీరాజనం సమర్పించారు. డి. పావని, జి. విజయ గౌరి, టి.పి. లావణ్య, ఎస్.కె.వి.ఎన్. శాస్త్రి, ఎం. కీర్తన, కె. శ్రీనివాస్, జి. చాముండి చౌదరి, జి. పావని, వి. మనోజ్ఞ కామేశ్వరి, డి. సాయి లిక్షిత శ్రీ, పి. పూజశ్రీ, డాక్టర్ కె. వరప్రసాద్, యు. వెంకట రామకృష్ణ, పి. గౌరీశ్వరరావు, వై. రాణి, బి.వి.కె.ఎస్. శ్రీకరి, వై. భానుశ్రీ శరిణి తదితరులు దేవీ స్తుతులు, మహిషాసురమర్దిని స్తోత్ర నృత్యాలు, శివతాండవ రూపకాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రదర్శనలను తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులను దేవస్థానం అధికారులు ప్రశంసించి, అమ్మవారి శేషవస్త్రాలు, పవిత్ర ప్రసాదాలు అందజేసి సత్కరించారు.