హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ సంతోషంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకురాలు కడెం అర్చన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు, ప్రకృతితో ముడిపడిన మన సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొని తెలంగాణ సంస్కృతిని భావితరాలకు చాటిచెప్పాలని పిలుపునిచ్చారు.
పద్మారావు నగర్ నియోజకవర్గం పరిధిలోని ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాం. డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
పండుగల సందర్భంగా కాలనీలు, వీధుల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బతుకమ్మ నిమజ్జనం సమయంలో చెరువులు, నీటి వనరుల పరిరక్షణకు సహకరించాలని కోరారు. ప్రజలందరూ పరస్పర ప్రేమాభిమానాలతో, కులమతాలకు అతీతంగా పండుగలను జరుపుకోవాలని సూచించారు.
ఈ బతుకమ్మ, దసరా పండుగలు ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అభివృద్ధి తీసుకురావాలని, ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు నింపాలని కడెం అర్చన ఆకాంక్షిస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.