BREAKING
వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ ఐసీసీ నిబంధనల ఉల్లంఘన.. ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ అఫ్సర్‌పై అధికారిక మందలింపు! గణేష్ నిమజ్జన సేవలకు గుర్తింపు సీపీ చేతుల మీదుగా భాను ప్రకాశ్‌కు సన్మానం అగ్రీగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేవరకు విశ్రమించం వరల్డ్ స్కేట్ గేమ్స్‌లో అద్భుత ప్రతిభ.. కాంస్య పతకం సాధించిన చరితశ్రీ బృందం! బతుకమ్మ ఘాట్ వద్ద ఏర్పాట్ల పరిశీలన దేశానికి ఆదర్శప్రాయుడు అబ్దుల్ కాలం భారతరత్న 96వ జయంతి వేడుకలు చలో హైదరాబాద్ విజయవంతం చేయండి శ్రీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గామాత అన్నదాన వితరణ ఆ ఆరు బంతులే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాయ్.. వెస్టిండీస్‌తో పోరులో టీమిండియా ఊహించని ఓటమి! రేబర్తి గ్రామాన్ని సందర్శించిన డి ఆర్ డి, ఏ పిడి...... బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: కడెం అర్చన దేవాలయ భూమి అక్రమంగా పట్టా చేసుకున్నారని గౌడ కులస్తుల ఫిర్యాదు.

అరకులోయ ఆసుపత్రిలో మరో అరుదైన శస్త్రచికిత్స

Select Suryaa Now
అరకులోయ ఆసుపత్రిలో మరో అరుదైన శస్త్రచికిత్స


అరకులోయ అల్లూరి సీతారామరాజు జిల్లా,అరకులోయ ఏరియా ఆసుపత్రిలో మరో కీలక శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు.అతి పెద్ద పరిమాణంలో ఉన్న పొత్తికడుపు గడ్డను శస్త్రచికిత్స ద్వారా తొలగించి,ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవల సామర్థ్యాన్ని మరోసారి చాటిచెప్పారు.
పెదబయలు మండలం, పెదకొండపల్లి పంచాయతీ పరిధిలోని కిల్లో సిటో తులబరంగి గ్రామానికి చెందిన మహిళ గత ఏడాది కాలంగా పొత్తికడుపులో గడ్డ,అధిక రుతుస్రావం (మెనోరేజియా),బహిష్టు సమయంలో తీవ్రమైన నొప్పి (డిస్మెనోరియా) వంటి సమస్యలతో బాధపడుతున్నారు.ఈ సమస్యలతో ఆమె పలు ప్రైవేటు ఆసుపత్రులతో పాటు విశాఖపట్నం కేజీహెచ్,పాడేరులోని ఆసుపత్రిని కూడా ఆశ్రయించారు. అయినప్పటికీ ఆమె సమస్యకు పరిష్కారం దొరకలేదు.ఈ నేపథ్యంలో అరకులోయ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు అవసరమైన పరీక్షలు నిర్వహించి, శస్త్రచికిత్స ద్వారా సుమారు 12×10 సెంటీమీటర్ల పరిమాణం గల పొత్తికడుపు గడ్డను తొలగించారు.ఈ శస్త్రచికిత్సను జనరల్ సర్జన్ డాక్టర్ లగుడు.రాము విజయవంతంగా నిర్వహించారు.మత్తు వైద్యులుగా డాక్టర్ అప్పారావు వ్యవహరించగా,స్టాఫ్ నర్సులు సావిత్రి, రాంబాబు,వైద్య సిబ్బంది మసరయ్య,అభిలాష  శస్త్రచికిత్సలో సహకరించారు. అరకులోయ ఏరియా ఆసుపత్రిలో వరుసగా కీలక శస్త్రచికిత్సలు నిర్వహించడం ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.పెద్ద ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ, స్థానికంగానే నాణ్యమైన వైద్యం అందించేందుకు ఆసుపత్రి వైద్య బృందం చేస్తున్న కృషికి ఈ శస్త్రచికిత్స మరో నిదర్శనంగా నిలిచింది.
అరకులోయ ఏరియా ఆసుపత్రి శస్త్రచికిత్సల విభాగం ఖాతాలో మరో విజయవంతమైన శస్త్రచికిత్స ఇదని చెప్పక తప్పదు.