దేవాలయ భూమి అక్రమంగా పట్టా చేసుకున్నారని గౌడ కులస్తుల ఫిర్యాదు.
రామాయంపేట :నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామ గౌడ సంఘానికి చెందిన ఎల్లమ్మ దేవాలయ భూమిని అక్రమంగా తమ పేరిట నమోదు చేసుకున్నారని ఆరోపిస్తూ గ్రామ గౌడ కులస్తులు గురువారం అధికారులకు ఫిర్యాదు చేశారు. దేవాలయానికి సంబంధించిన మూడు ఎకరాల భూమిని గ్రామానికి చెందిన చింతల లక్ష్మి, భర్త నాగరాజు, చింతల పుష్ప, భర్త యాదగిరి తమ పేరిట అక్రమంగా చేయించుకున్నారని ఆరోపించారు.ఈ విషయంపై స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్కు వినతిపత్రం అందజేసి, భూమి రికార్డులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గత పదేళ్లుగా ఈ భూమికి సంబంధించిన రైతుబంధు నిధులు సైతం వారి ఖాతాల్లో జమ అవుతున్నాయని ఆరోపిస్తూ, రైతుబంధు చెల్లింపులను నిలిపివేయాలని కోరుతూ మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డికి కూడా వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. గౌడ సంఘ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, యాదగౌడ్, మహేందర్ గౌడ్, బాల్ నర్సాగౌడ్ పర్సాగౌడ్ తదితరులు ఉన్నారు.