BREAKING
కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ ఐసీసీ నిబంధనల ఉల్లంఘన.. ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ అఫ్సర్‌పై అధికారిక మందలింపు! గణేష్ నిమజ్జన సేవలకు గుర్తింపు సీపీ చేతుల మీదుగా భాను ప్రకాశ్‌కు సన్మానం అగ్రీగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేవరకు విశ్రమించం వరల్డ్ స్కేట్ గేమ్స్‌లో అద్భుత ప్రతిభ.. కాంస్య పతకం సాధించిన చరితశ్రీ బృందం! బతుకమ్మ ఘాట్ వద్ద ఏర్పాట్ల పరిశీలన దేశానికి ఆదర్శప్రాయుడు అబ్దుల్ కాలం భారతరత్న 96వ జయంతి వేడుకలు చలో హైదరాబాద్ విజయవంతం చేయండి శ్రీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గామాత అన్నదాన వితరణ ఆ ఆరు బంతులే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాయ్.. వెస్టిండీస్‌తో పోరులో టీమిండియా ఊహించని ఓటమి! రేబర్తి గ్రామాన్ని సందర్శించిన డి ఆర్ డి, ఏ పిడి...... బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: కడెం అర్చన దేవాలయ భూమి అక్రమంగా పట్టా చేసుకున్నారని గౌడ కులస్తుల ఫిర్యాదు. అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత.. వంద సిక్సర్ల మైలురాయిని అందుకున్న సంజు శాంసన్!

ఉపాధి పనులపై సామాజిక తనిఖీ…

Select Suryaa Now
ఉపాధి పనులపై సామాజిక తనిఖీ…

ఉపాధి పనులపై సామాజిక తనిఖీ…
-రూ.1,13,000 జరిమానా విధించిన ఏపీడీ 
బెజ్జంకి,మేజర్ న్యూస్:
ఉపాధి పనుల్లో ఎలాంటి లోపాలకు సైతం చోటులేకుండా మరింత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఏపీడీ)శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.రూ.9.27 కోట్లతో మండలంలో ఉపాధి పనులు జరగగా,రిజిస్టర్ నిర్వహణ,తదితర లోపాలపై ఉపాధి సిబ్బందికి రూ.1,13,000 జరిమానా విధించినట్లు తెలిపారు.మండలంలో ఏప్రిల్ 2025నుంచి మార్చి వరకు చేపట్టిన ఉపాధి హామీ పనులపై మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం అయన సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండలంలోని గ్రామపంచాయతీల వారీగా చేపట్టిన పనులు,రికార్డులు,సోషల్ ఆడిట్ అంశాలను వేదికలో రిసోర్స్ పర్సన్లు నివేదించారు.గ్రామాల వారి నివేదికల విచారణ అనంతరం ఏపీడీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.రిజిస్టర్ నిర్వహణ తదితర అంశాల్లో లోపాలు వెళ్లడైనట్లు పేర్కొన్నారు.ఉపాధి హామీ పథకం ద్వారా మండలంలో ఈజీఎస్,పీఆర్ విభాగల కింద మొత్తం రూ.9,27,34,802 నిధులతో 634 పనుల లెక్కలను రిసోర్స్ పర్సన్లు అధికారుల సమక్షంలో నివేదించినట్లు పేర్కొన్నారు.కార్యక్రమంలో  ఎంపీడీవో ప్రవీణ్, క్వాలిటీ కంట్రోలర్ సతీష్,సోషల్ ఆడిట్ రిపోర్టర్ గణేష్,ఎంపీఓ ఖలీల్,ఏపీఓ రాములు,ఏఈపీఆర్ తదితరులు పాల్గొన్నారు.సూర్యన్యూస్(బెజ్జంకి)