జెడ్పీటీసీ అభ్యర్థిగా ఎమ్మెల్యే తనయుడు!
అరకులోయ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగేందుకు అరకులోయ నియోజకవర్గ శాసనసభ్యుడు రేగం. మత్స్యలింగం రెండో కుమారుడు రేగం.చాణక్య ఉత్సాహం చూపుతున్నారు.
అరకులోయ మండల జెడ్పీటీసిసీ అభ్యర్థిగా ఎమ్మెల్యే తనయుడు చాణక్య పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఎన్నికల బరిలో దిగి ఘన విజయం సాధించి తండ్రి ఎమ్మెల్యే బాటలో పయనించాలనే ఉద్దేశ్యంతో మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయాలనే భావనతో రంగం సిద్ధం చేసుకుంటున్నారు.మండల జెడ్పీటీసీ పదవికి కొత్త వెలుగులు తీసుకుని వచ్చి ప్రజా సేవా చేయడానికి ఎన్నికల బరిలో నిలువనున్నారు.అన్ని ఏర్పాట్లతో వైయస్సార్ కాంగ్రేస్ పార్టీ తరపున ఎన్నికల బరిలో ఎమ్మెల్యే రెండో కుమారుడు దిగబోతున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశావాహులలో మొదటి వరుసలో ఉన్న రేగం. చాణక్య పోటీకి సిద్ధంగా ఉన్నారు.తన దరఖాస్తును పార్టీ అధినేత,రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందజేసేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమావేశంలో మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా రేగం. చాణిక్య పేరును పార్టీ శ్రేణులు ఖరారు చేసినట్టు సమాచారం.అయితే అధికారికంగా ఇంతవరకు ప్రకటించలేదు.సామాజిక సమీకరణాల దృష్ట్యా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే తనయుడును ఎన్నికల బరిలోకి దించుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలుగుదేశం పార్టీ మండల జెడ్పీటీసీ అభ్యర్థి పేరు ప్రకటించిన తర్వాత ఎమ్మెల్యే తనయుడు చాణిక్య పేరును ప్రకటించే అవకాశం ఉంది.ఉన్నత చదువులు చదువుకున్న రేగం.చాణక్య అల్లూరి సీతారామరాజు జిల్లా, హుకుంపేట మండలానికి చెందినవారు. శాసనసభ్యుడు కుమారుడైన ఈయన జెన్-జీ తరానికి చెందిన యువ రాజకీయ నాయకుడు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్న రేగం. చాణిక్య గత కొంతకాలం నుంచి పార్టీ బలోపేతం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమాన అనుచరులుగా ఎమ్మెల్యే కుటుంబం మొదటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తుంది.కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ, యువ నాయకుడు రాజకీయాలపై ఆకర్షితుడై స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగ్రేటం చేస్తున్నారు.మండల జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయడానికి సిద్ధపడుతున్న తనను ఆశీర్వదించాల్సిందిగా పార్టీ అధ్యక్షుడు వైయస్. జగన్మోహన్ రెడ్డి,స్థానిక ప్రజలను రేగం.చాణిక్య కోరుతున్నారు.స్థానిక ప్రజల సమస్యలు తెలిసిన తాను ఘనవిజయం సాధిస్తానని, అన్ని వర్గాల ప్రజల ఆదరణను పొందుతానని ధీమా వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.