BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

వరి పంటలో తెగుళ్లు, పురుగుల నివారణకు సకాలంలో చర్యలు చేపట్టాలి.

Select Suryaa Now
వరి పంటలో తెగుళ్లు, పురుగుల నివారణకు సకాలంలో చర్యలు చేపట్టాలి.

 అనపర్తి, మేజర్ న్యూస్.వరి పంట చివరి దశలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తెగుళ్లు, పురుగుల ఉద్ధృతిపై రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏరువాక కేంద్రం సమన్వయకర్త డా. మానుకొండ శ్రీనివాస్ సూచించారు. బిక్కవోలు మండలంలోని తొస్సిపూడి, పందలపాక, మెల్లూరు గ్రామాల్లో పర్యటించి వరి పంటలను పరిశీలించిన ఆయన రైతులకు పలు సూచనలు చేశారు.

ప్రస్తుతం వరి పంటలో ఎర్రనల్లి, ఆకుముడత పురుగు, పాముపొడ తెగులు సమస్యలు కనిపిస్తున్నాయని, వీటి నివారణకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు తగిన మందులను సరైన మోతాదులో వినియోగించాలని తెలిపారు. సుడిదోమ ఉద్ధృతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవసరమైనప్పుడే నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. పురుగుల నివారణ మందులను విచక్షణారహితంగా వినియోగించరాదని పేర్కొన్నారు.
రానున్న రబీ సీజన్‌లో సాగునీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని, నీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మినుము, పెసర, జొన్న, సజ్జ, రాగి, మొక్కజొన్న వంటి పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. నీటి వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ సాగు ఖర్చులను నియంత్రించుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.ఈ పర్యటనలో అనపర్తి వ్యవసాయ సహాయ సంచాలకులు డి.వి. కృష్ణ, బిక్కవోలు మండల వ్యవసాయ అధికారి జి. వాణి, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీనివాసు, గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.