ఏపీ ఫైబర్ షెల్టర్ లో నాలుగు బ్యాటరీల చోరీ.
అనంతగిరి,అనంతగిరి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయ ఆవరణంలో ఉన్న ఏపీ ఫైబర్ షెల్టర్ లో సుమారు లక్ష రూపాయలు విలువైన నాలుగు బ్యాటరీలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు ఏపీ ఫైబర్ పిఓపి ఇంజనీర్ సంతోష్, ఏపీ ఫైబర్ ఆపరేటర్ కమిడి కుమారి అనంతగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం ఏపీ ఫైబర్ షెల్టర్ లో ఉన్న నాలుగు అమరాన్ బ్యాటరీలను గుర్తు తెలియని వ్యక్తులు వైర్లు కట్ చేసి చోరీకి పాల్పడినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనివల్ల ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడిందని అదే విధంగా లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించిందని వారు పేర్కొన్నారు.