BREAKING
పట్ట భద్రులు తమ ఓటు నమోదు చేసుకోవాలి : గోపు రమణారెడ్డి బన్సీలాల్‌పేట మెట్ల బావి వద్ద ఘనంగా బతుకమ్మ వేడుకలు డ్రిప్‌ ద్వారా ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన ఏషియన్ గేమ్స్ విజేతలను అభినందించిన ప్రధాని మోదీ.. 140 కోట్ల భారతీయుల గర్వకారణమని ప్రశంస! సంగారెడ్డి, మేడ్చల్ డిపోల్లో టి జె ఎమ్ యూ గెలుపు భారత్ పర్యటనకు ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్లు ప్రకటన.. పూర్తి షెడ్యూల్ మరియు వివరాలు! కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం జన్మదిన వేడుకలు రంజీ ట్రోఫీ రెండో రౌండ్.. మహారాష్ట్ర కెప్టెన్‌గా పృథ్వీ షా కొనసాగింపు, జట్టులోకి రుతురాజ్ గైక్వాడ్ రీఎంట్రీ! బ్యాతల శివ శంకర్ మాదిగకు మందకృష్ణ మాదిగ నివాళులు బద్వేల్ మున్సిపల్ ఎన్నికలపై సానుకూల చర్చ మద్దికుంటలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు - ఆకట్టుకుంటున్న విద్యుద్దీపాల అలంకరణ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు స్టార్ పేసర్ బుమ్రా దూరం.. మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం! మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ బాలస్వామిరెడ్డి పిడుగుపాటుకు గురై మహిళా కూలి మృతి ఉపాధి పనులపై సామాజిక తనిఖీ…

సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి దర్శనం

Select Suryaa Now
సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి దర్శనం

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు నాలుగు మాడ వీధుల్లో ఈ వాహనసేవ అత్యంత వైభవంగా సాగింది. వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తబృందాల చెక్కభజనలు, జీయ్యంగార్ల గోష్టి, మంగళవాయిద్యాల నడుమ తిరుమల మాడ వీధులు భక్తిభావంతో పరవశించాయి. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద నామస్మరణతో స్వామివారిని సేవించుకున్నారు.

సర్వభూపాల వాహనసేవ విశిష్టత:

సర్వభూపాల అంటే సమస్త రాజులు అని అర్థం. అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, పరమేశ్వరుడు లోకాలను పరిరక్షించే శక్తులకు ప్రతీకలుగా నిలుస్తారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై మోస్తూ సేవించడం ఈ వాహనసేవ ప్రత్యేకత. ప్రజలను ధర్మబద్ధంగా పరిపాలిస్తూ, భగవంతుని ఆశీస్సులతో లోకక్షేమానికి కృషి చేయాలనే సత్సంకల్పాన్ని, ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ సర్వభూపాల వాహనసేవ భక్తులకు చాటిచెబుతుంది.