telanagana
బన్సీలాల్పేట మెట్ల బావి వద్ద ఘనంగా బతుకమ్మ వేడుకలు
సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : బన్సీలాల్పేటలోని చారిత్రక మెట్ల బావి వద్ద బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీమంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మహిళలతో కలిసి తలసాని బతుకమ్మ పాటలకు స్టెప్పులు వేసి సందడి చేశారు. వేడుకల్లో మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు.