సంగారెడ్డి, మేడ్చల్ డిపోల్లో టి జె ఎమ్ యూ గెలుపు
తెలంగాణ బ్యూరో ప్రతినిధి : రాష్ట్ర వ్యాప్త ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టి జె ఏం యూ ) మరో రెండు డిపోల్లో పోస్టల్ బ్యలేట్ ఓట్ల తో గెలుపొందిన సందర్భంగా టి జె ఏం యూ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ అభినందనలు తెలిపారు . మొట్టమొదట సంగారెడ్డి డిపోలో విజయానికి బాట వేసిన నిర్మల జగ్గా రెడ్డి ,
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అనంత కిషన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంగారెడ్డి , మేడ్చల్ డిపోల లో పోస్టల్ బ్యాలెట్ లో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ గెలుపొందింది . సంగారెడ్డి డిపోలో పోస్టల్ బ్యాలెట్ లో ఆరు ఓట్లకు గాను ఆరు ఓట్లు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ కు వచ్చాయి . మేడ్చల్ డిపోలో 297 టి జె ఏం యూ కు 297 టి డబ్ల్యూ యు సమానంగా ఉండడంతో కేవలం ఒకే ఒక పోస్టల్ బ్యాలెట్ టి జె ఏం యూ కు రావడం గమనార్హం . పోస్టల్ బ్యాలెట్ అనంతరం సంగారెడ్డి డిపోలో మరియు మేడ్చల్ డిపోలో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టి జె ఎమ్ యూ ) గెలుపొందినదని తెలుపుటకు సంతోషిస్తున్నామని హనుమంతు ముదిరాజ్ తెలిపారు . 9వ తేదీ జరిగిన కౌంటింగ్ లో షాద్నగర్ డిపోలో టి జె ఏం యూ గెలుపొందిన విషయం అందరికీ తెలిసిందేనని , మొత్తం మూడు (3) డిపోలలో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ గెలుపుతో ప్రారంభించడం జరిగిందని . ఈ గెలుపుకు కృషిచేసిన సహకరించిన మిత్రులకు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు టి జె ఏం యూ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ తెలిపారు . అదే విధంగా ఈ యొక్క విజయానికి కష్టపడిన, డిపో అధ్యక్ష కార్యదర్శులకు, డిపో కమిటీ నాయకులకు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పల్లె కృష్ణమూర్తి కి, రీజినల్ కార్యదర్శి అంజయ్య గౌడ్ కి, ధన్యవాదాలు తెలిపారు ఈ యొక్క విజయానికి పాటుపడిన డిపో సోదర సోదరీమణులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా టి జె ఎమ్ యూ రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు .