telanagana
పట్ట భద్రులు తమ ఓటు నమోదు చేసుకోవాలి : గోపు రమణారెడ్డి
మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించు కునేందుకు ప్రతి పట్ట భద్రుడు తమ ఓటు నమోదు చేసుకోవాలని బీజేపీ నేత గోపు రమణారెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఆయన నేరేడ్ మెట్ లోని తన నివాసంలో ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం పట్టభద్రుల బాధ్యత అన్నారు. డిగ్రీ లేదా ఏదైనా డిప్లోమా పూర్తి చేసిన ప్రతి ఒక్క పట్టభధ్రుడు తప్పని సరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.