రవీందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పైలెట్ రోహిత్ రెడ్డి
రవీందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పైలెట్ రోహిత్ రెడ్డి
యాలాల, మేజర్ న్యూస్:మండలం ఎన్కేపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సి.రవీందర్ రెడ్డి నానమ్మ రాసమ్మ మృతి చెందడంతో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.రాసమ్మ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ,ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, మనోధైర్యాన్ని కల్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సిద్రాల శ్రీనివాస్,సీనియర్ నాయకుడు సాయిపూర్ నర్సింలు,జక్కెపల్లి గణేష్ తదితరులు పాల్గొని రాసమ్మ మృతికి సంతాపం తెలిపారు.