telanagana
రూ.2 లక్షల ఎల్ఓసీ అందించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
సూర్య వేల్పూరు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పచ్చల నడుకుడ గ్రామానికి చెందిన జాన జమునకు వైద్య ఖర్చుల నిమిత్తం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రూ.2 లక్షల విలువైన ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) అందజేశారు.జాన జమున కుటుంబ సభ్యులకు ఎల్ఓసీని అందజేసిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ వైద్యులతో మాట్లాడారు. జాన జమున త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబానికి వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించడం పట్ల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.