BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

ఈరవత్రి అనిల్‌కు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇవ్వాలి: పద్మశాలి సంఘం నేతల విజ్ఞప్తి

Select Suryaa Now
ఈరవత్రి అనిల్‌కు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇవ్వాలి: పద్మశాలి సంఘం నేతల విజ్ఞప్తి
 తెలంగాణ బ్యూరో, ప్రతినిధి: ఈరవత్రి అనిల్ కుమార్ కు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని పద్మశాలి సంఘం నాయకులు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గత నెల 30న సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీకి అనుగుణంగా, బీసీ వర్గాల్లో పద్మశాలి సామాజిక వర్గానికి తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈరవత్రి అనిల్ కు శాసనమండలి సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని కోరారు.
 
చేనేత కార్మికుల సంక్షేమానికి చేసిన సేవలు
 
పద్మశాలి  సంఘం నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని తన కార్యక్రమంగా భావించి  విజయవంతం చేయడంలోను, ప్రభుత్వంతో సమన్వయం సాధించడంలోను ఈరవత్రి అనిల్ కీలక పాత్ర పోషించారని నేతలు గుర్తుచేశారు. ప్రతిసారి సంఘం అతని దృష్టికి తీసుకుపోయే ప్రతి విషయాన్ని ప్రభుత్వంతో చర్చించి అందర్నీ సమన్వయం చేస్తున్న ఫలితంగానే రాష్ట్రంలో రూ. 49 కోట్ల చేనేత రుణమాఫీ అమలు సాధ్యమైంది. నిలిచిపోయిన రూ. 290 కోట్ల 'చేనేత చేయూత' బకాయిలు విడుదలయ్యాయి.  తెలంగాణలో పద్మశాలి మరియు వివిధ సామాజిక వర్గాలకు చెందిన సామాన్య ప్రజలు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందించే విధానాన్ని ప్రభుత్వం  దృష్టికి తీసుకెళ్లి అది అమలయేలా చేసిదాంట్లో కృషి చేశారు. బహుముఖ ప్రజాసేవకు, కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే బీసీ సామాజిక వర్గానికి, ముఖ్యంగా చేనేత వర్గాలకు రాజకీయంగా పెద్దపీట వేసినట్లవుతుందని పద్మశాలి సంఘం నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం సెక్రటరీ జనరల్ గడ్డం జగన్నాథం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామర్తపు మురళి, ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచంద్రరావు, గౌరవ అధ్యక్షులు మెతుకు సత్యం, ఉపాధ్యక్షులు గుర్రం శ్రవణ్, అఖిలభారత పద్మశాలి సంఘం యువజన విభాగం జాతీయ ఇంచార్జ్ అవ్వారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.