BREAKING
హత్య కేసులో భార్యాభర్తలు అరెస్ట్ --స్మార్ట్‌ఫోన్ స్వాధీనం ఆసియా పతక విజేతలతో ప్రధాని మోడీ సమావేశం మేడ్చల్ డిపో TJMU ఘన విజయం.. గౌరవ అధ్యక్షుడిగా జగన్ గౌడ్, సెక్రటరీగా శ్రీనివాస్ మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం.. క్రమశిక్షణ, కష్టం తోలినాళ్ల నుంచి అగ్రస్థానం వరకు! ముంబైలో లగ్జరీ ఆఫీస్ స్పేస్‌ను లీజుకిచ్చిన సైఫ్ అలీ ఖాన్.. ప్రతినెలా భారీగా వస్తున్న అద్దె! కొలిక్కి వస్తున్న సీట్ల సర్దుబాటు ఎన్నికల పరిశీలకులుగా 28 మంది ఐఏఎస్‌ల నియామకం మొలకెత్తిన గింజలు తింటే నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా?.. వీటిని తినే సరైన విధానం ఇదే! పిల్లలు మొబైల్ ఫోన్‌కు ఎందుకు బానిసలవుతున్నారు?.. తల్లిదండ్రులు తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే! మల్లారెడ్డిగూడెంకు మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి.. స్పీకర్‌కు సర్పంచ్ వినతి స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపుకు కృషి చేయండి చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ రేసులో ' మీసాల ' ? .....పోటీ ' బెల్లాన వర్సెస్ మీసాల' కానుందా?.... అక్రమంగా అమర్చిన 12 మోటార్లు స్వాధీనం డాక్టర్ బి.వి. రాజు 106వ జయంతి.. ఘనంగా సేవా కార్యక్రమాలు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ఈ మార్పులు తప్పనిసరి.. ప్రశాంతమైన వాతావరణం కోసం ఇవి చేయండి!

ఎల్లంపేట్ మున్సిపాలిటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Select Suryaa Now
ఎల్లంపేట్ మున్సిపాలిటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
మేడ్చల్, మేజర్ న్యూస్:తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు, పూల పండుగ వైభవానికి ప్రతిబింబంగా నిలిచే బతుకమ్మ సంబరాలు మహిళల్లో ఉత్సాహాన్ని నింపాయి. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ మహిళలు వేడుకల్లో పాల్గొన్నారు.తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెప్పే బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ద్వారా మన సంస్కృతి, వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరాన్ని ఈ వేడుకలు గుర్తుచేశాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ సందడి చేయడంతో పండుగ వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో ఎల్లంపేట్ మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడ్యా శ్రీదేవి రమేష్, వైస్ చైర్‌పర్సన్ మేకల రజిత దేవేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు అర్చన శ్రీనివాస్, శ్రీలత రమేష్, శారదా రాజు నాయక్, మహేశ్వరి రాజేష్, సురేష్ రెడ్డి, భాస్కర్, బందెల కుమార్, నునావత్ శాంతి, రాజు నాయక్ తదితరులు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.