telanagana
పరిగి లో వైభవంగా బతుకమ్మ వేడుకలు
పరిగి: మేజర్ న్యూస్ (అక్టోబర్ 15). తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, సంప్రదాయాలకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే వేడుకలు బతుకమ్మ పండుగ అని పరిగి ఎమ్మెల్యే టీఆర్ఆర్ సతీమణి, పరిగి మున్సిపల్ చైర్ పర్సన్ కుడుముల రజిత వెంకటేష్ అన్నారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగ గురువారం సాయంత్రం పట్టణంలోని గాంధీ విగ్రహం దగ్గర బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి బింబించే ఈ పండుగలో మహిళలు, యువతులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి సాయంత్రం వేళల్లో మహిళలంతా ఒకచోట చేరి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సంప్రదాయ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతారని తెలిపారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర పూలతో అలంకరించిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు.బతుకమ్మ పండుగ మహిళల్లో ఐక్యతను పెంపొందించడంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే గొప్ప వేడుకగా నిలుస్తోందన్నారు. ప్రకృతిని పూజిస్తూ, పూలను ఆరాధించే ఈ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.