జాతీయ స్థాయి క్రీడలకు ఆర్ కె విద్యార్థిని ఎంపిక
జాతీయ స్థాయి క్రీడలకు ఆర్ కె విద్యార్థిని ఎంపిక చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ స్కూలు గేమ్స్ ఫెడరేషన్ నేతృత్వంలో 2025-26 సంవత్సరానికి గాను 70వ అంతర్ జిల్లాల టెన్నీస్ గేమ్స్ బాలికల అండర్-17 పోటీలు శ్రీకాళహస్తిలో ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పోటీలలో చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్ కెే విద్యాలయ జూనియర్ కళాశాల ఇంటర్ విద్యార్థిని సుమేరా అన్సారీ సయ్యద్ రాష్ట్ర స్థాయి మూడవ స్థానంలో నిలిచి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్ బాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23వ తేదిన న్యూ ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున పాల్గొననున్నారని తెలిపారు. కళాశాల మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ డి ఎ కల్పజ అన్సారీని జాతీయ స్థాయిలో జరిగే క్రీడలలో విజయం సాధించాలని అభినందించి ఆశీర్వదించారు.