BREAKING
ఎంపిపి, జెడ్పీటీసీ, ఎంపిటిసి ల రిజర్వేషన్ లు ఖరారు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో మరో సినిమా తీయడమే నా చివరి కోరిక.. కరణ్ జోహార్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఎముకల దృఢత్వానికి బీన్స్ చేసే మేలు.. అవసరమైన ముఖ్యమైన పోషకాలు ఇవే! పుల్లలచెరువు మండలంలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ బ్లాక్‌బస్టర్ ది ఒడిస్సీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? చిన్నగంజాం ఎస్‌ఐ సురేష్‌కు ఎమ్మెల్యే ఏలూరి శుభాకాంక్షలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ ఆర్సీ 17 కొత్త ఆఫీస్ పూజా కార్యక్రమాలు పూర్తి! శాంతియుత వాతావరణానికి ప్రజల సహకరించాలి కేటిఆర్ తో మురళీకృష్ణ యాదవ్ మూలాఖాత్ కిరాతక భార్య, ప్రియులకు ఉరిశిక్ష ట్యాంకర్ల నీటితో వరి పంటను కాపాడుకుంటున్న రైతు జాతీయ స్థాయి క్రీడలకు ఆర్ కె విద్యార్థిని ఎంపిక బెజ్జుర్‌లో భక్తిశ్రద్ధలతో నాలుగో రోజు పూజలు - అన్నదాన వితరణ 4వ రోజుకు చేరిన సాయిబాబా ఆరాధన ఉత్సవాలు నెల్లూరు నగరంలో దూకుడు పెంచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..

రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మ దహనయత్నం:అడ్డుకున్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు!

Select Suryaa Now
రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మ దహనయత్నం:అడ్డుకున్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు!

తెలంగాణ బ్యూరో ప్రతినిధిః కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని హైదరాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) నాయకులు అడ్డుకున్నారు. ఆదివారం ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌ వెలుపల ఈ ఘటన చోటుచేసుకుంది. భారీ పోలీసు బారికేడ్లు, కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ బీజేపీకి చెందిన మహిళా కార్యకర్తల బృందం రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మతో అక్కడికి చేరుకోవడంపై హైదరాబాద్‌ కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఢిల్లీ పోలీసుల తీరుపైనా ప్రశ్నలు లేవనెత్తారు. హైదరాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు సయ్యద్‌ ఖాలిద్‌ సైఫుల్లా, బహదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజేష్‌ కుమార్‌, యాకుత్‌పురా ఇన్‌చార్జి రవి రాజ్‌, చార్మినార్‌ ఇన్‌చార్జి అడ్వొకేట్‌ మహమ్మద్‌ ముజీబుల్లా షరీఫ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు శైలేందర్‌ ఇందిరా భవన్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. రాహుల్‌ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు నిరసనకారులు ప్రయత్నించడంతో కాంగ్రెస్‌ నాయకులు వెంటనే జోక్యం చేసుకుని దిష్టిబొమ్మను వారి నుంచి తీసుకున్నారు. దహనయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటన పోలీసుల సమక్షంలోనే జరిగినప్పటికీ, విధుల్లో ఉన్న సిబ్బంది వెంటనే జోక్యం చేసుకోలేదని హైదరాబాద్‌ డీసీసీ ఆరోపించింది. దీంతో డీసీసీ అధ్యక్షుడు సయ్యద్‌ ఖాలిద్‌ సైఫుల్లా స్వయంగా పోలీసుల వద్దకు వెళ్లి, నిరసనకారులను అక్కడి నుంచి తొలగించాలని కోరినట్లు వెల్లడించింది. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల కదలికలపై ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో, భారీ బారికేడ్లను దాటి దిష్టిబొమ్మతో వచ్చిన బృందం పార్టీ ప్రధాన కార్యాలయానికి సమీపంలోకి ఎలా చేరుకుందని డీసీసీ ప్రశ్నించింది. పోలీసుల వ్యవహారశైలిలో పక్షపాతం కనిపిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేసింది.

పోలీసింగ్‌లో ఒకే ప్రమాణాలు ఉండాలి

ఈ సందర్భంగా సయ్యద్‌ ఖాలిద్‌ సైఫుల్లా మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం చుట్టూ కాంగ్రెస్‌ నాయకుల కదలికలపైనే కఠిన ఆంక్షలు విధించిన పోలీసులు, దిష్టిబొమ్మతో వచ్చిన నిరసనకారులను ఇందిరా భవన్‌ వరకు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు తక్షణమే ఎందుకు జోక్యం చేసుకోలేదని నిలదీశారు. పోలీసుల చర్యల్లో అందరికీ ఒకే విధమైన ప్రమాణాలు వర్తించాలని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును గౌరవిస్తామని హైదరాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ పేర్కొంది. అయితే, ఇందిరా భవన్‌ పరిసరాల్లో ప్రవేశం, పోలీసుల చర్యల విషయంలో కనిపించిన వ్యత్యాసంపై ఢిల్లీ పోలీసులు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.