స్థానిక షెడ్యూల్ వచ్చేసింది..
అమరావతి:ఆంధ్రప్రదేశ్లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రంలో వివిధ దశల్లో స్థానిక ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది.
మొత్తం 100 అర్బన్ లోకల్ బాడీస్కు (యూఎల్బీ) ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో భాగంగా 10 నగర పంచాయతీలు, 77 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల కీలక తేదీల వివరాలు:
* అక్టోబర్ 28: మున్సిపల్ ఎన్నికల పోలింగ్.
* అక్టోబర్ 30: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడి.
* నవంబర్ 3: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.
* నవంబర్ 5: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు.
* నవంబర్ 26: తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు, అదే రోజు ఫలితాలు.
* నవంబర్ 29: రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు, అదే రోజు ఫలితాలు.
* డిసెంబర్ 2: మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు, అదే రోజు ఫలితాలు.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరిగిన రోజే ఫలితాలు వెలువడనున్నాయి. ఈ షెడ్యూల్ ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది.