స్వశక్తితో మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలి :ఎమ్యెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి
స్వశక్తితో మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలి :ఎమ్యెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి
54 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్యెల్యే
కనిగిరి ,మేజర్ న్యూస్ :మహిళలు కుట్టు మిషన్ ద్వారా స్వశక్తితో ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని ఎమ్యెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు .దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజనలో ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న 54 మంది మహిళలకు జననీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఉచితంగా కుట్టు మిషన్లను ఎమ్యెల్యే చేతుల మీదుగా బుధవారం పంపిణీ చేశారు .ఈ సంధర్భంగా ఎమ్యెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ కుట్టు శిక్షణా కేంద్రంలో నేర్చుకున్న మెళుకువలు ద్వారా టైలరింగ్ రంగంలో బాగా రాణించాలని అన్నారు .మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పధకాలు చేపడుతున్నట్లు తెలిపారు .ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్ మెంట్ అధికారిణి ఇందిరా దేవి ,మండల పార్టీ అధ్యక్షులు కొండా కృష్ణారెడ్డి ,ఏనుగంటి శ్రీనివాసులు ,సానికొమ్ము తిరుపతిరెడ్డి ,జిల్లా షీప్ సొసైటీ మాజీ అధ్యక్షులు తోడేటి గోపి ,బిజేపి నాయకులు కొండిశెట్టి రమణయ్య ,కరస్పాండెంట్ మువ్వా రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు .