బైండోవర్ కేసులు నమోదు చేస్తాం...ఎస్సై..!
బైండోవర్ కేసులు నమోదు చేస్తాం...ఎస్సై..!
- అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతాం.
- దామగట్ల లో 19 మద్యం బాటీలు స్వాధీనం
నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్ -: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ అలజడలు సృష్టిస్తే బైండోవర్ కేసులు నమోదు చేస్తామని బ్రాహ్మణ కొట్కూర్ ఎస్సై మణికంఠ హెచ్చరించారు. గురువారం మండల పరిధిలోని దామగట్ల గ్రామంలో బోయ మునిస్వామి అనే వ్యక్తి నుండి అక్రమంగా నిల్వచేసిన 19 మద్యం బాటిల్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కొరకు కోర్టుకు తరలించడం జరిగిందన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్న అక్రమార్కులపై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు. గ్రామంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు పాల్పడిన మరియు అలజడి సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుళ్లు రమణ, నూర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.