BREAKING
రోజూ జ్యూస్ తాగుతున్నారా?.. పండ్లను జ్యూస్‌లా కాకుండా నేరుగా తినడం ఎందుకు మేలో తెలుసా! నంద్యాల పురపాలక సంఘం 29వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థిగా రుషి కేశవరెడ్డి ఎల్‌నినో నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి చేనేత వస్త్రాల కొనుగోలుతో నేతన్నలకు ప్రోత్సాహం సింగరేణి కార్మికులకు వరాల జల్లు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐఎన్‌టీయూసీ పాలాభిషేకం డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారంపై కసరత్తు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న కార్తీక్ ఆర్యన్ సైకలాజికల్ థ్రిల్లర్.. ఫ్రెడ్డీ మూవీ విశేషాలు ఏసీబీ సోదాల వేళ.. బాధితుల బాణాసంచా సంబరాలు! యశోద ఆస్పత్రిలో అధునాతన రోబోటిక్ ఎండోస్కోపీ ద్వారా న్యూరో చికిత్సలు.. దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి వృద్ధాశ్రమంలో పోలీస్ కమిషనర్ సేవా కార్యక్రమం రాప్తాడు మండలంలో సర్పంచి స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు రేపు ఐదు 2బీ బార్లకు లాటరీ:జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఆర్. ప్రవీణ్ సారస్ మేళా–2026లో కామారెడ్డి మహిళల విజయం అభినందనీయం దీపికా పదుకొణె 8 గంటల పనివేళల డిమాండ్‌పై ఇషితా దత్తా కీలక వ్యాఖ్యలు.. మద్దతుగా నిలిచిన నటి

మున్సిపల్ ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించాలి

Select Suryaa Now
మున్సిపల్ ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించాలి

మున్సిపల్ ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించాలి 
కనిగిరి ,మేజర్ న్యూస్ : ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తూ, ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, విధుల్లో అశ్రద్ధ, అజాగ్రత్తకు ఏమాత్రం తావివ్వకూడదని అసిస్టెంట్ ఎలక్షన్‌ అథారిటీ,  కనిగిరి మునిసిపల్ కమీషనర్ పి.శ్రీధర్  స్పష్టం చేశారు. గురువారం పురపాలక సంఘం కార్యాలయంలో  రిటర్నింగ్‌ అధికారులు, మున్సిపల్‌ సిబ్బందికి శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  కమీషనర్ శ్రీధర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల పునర్విభజన, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, మరమ్మతులు, రిజర్వేషన్లు, కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు తదితర ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు  తెలిపారు.  కనిగిరి పురపాలక సంఘం పరిధిలో 32 వార్డులు ఉండగా, మొత్తం 34,415 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. వీరిలో 16,900 మంది పురుషులు, 17,503 మంది మహిళలు, 12 మంది ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు ఉన్నారని వివరించారు. ప్రతి నాలుగు వార్డులకు ఒక ఎలక్షన్ ఆఫీసర్ లను నియమించి, ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చైర్మన్, కౌన్సిలర్  పదవులకు పోటీ చేసే అభ్యర్థులకు కనీస వయస్సు 21 ఏళ్లు ఉండాలని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను చిత్రీకరించేందుకు వీడియో గ్రాఫర్లను నియమిస్తున్నట్లు, ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసినట్లు తెలిపారు. రిటర్నింగ్‌ అధికారులు తమ లాగిన్‌ల ద్వారా సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో ప్రతిరోజూ నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన హ్యాండ్‌బుక్‌లను పూర్తిగా చదివి, నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 
చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులకు సంబంధించిన బ్యాలెట్‌ పత్రాలను ఓటర్లు ఒకే బ్యాలెట్‌ బాక్స్‌లో వేయాల్సి ఉంటుందని వివరించారు.
పోటి చేసే అభ్యర్థులు ఎన్నికల నిభందనలు పాటించాలి 
-----------
మున్సిపల్ ఎన్నికలకు సంభందించి వివిధ రాజకీయ పార్టీల నాయకులతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ఖర్చు పరిమితులను తప్పనిసరిగా పాటించాలని కమీషనర్‌ సూచించారు.  చైర్మన్  అభ్యర్థి గరిష్ఠంగా రూ. 20  లక్షలు, కౌన్సిలర్ అభ్యర్థి రూ. 7.50  లక్షల వరకు ఖర్చు చేయవచ్చని తెలిపారు. నామినేషన్ దరఖాస్తు కొరకు                 ఓసి అభ్యర్ధులు రూ. 3,000, ఎస్టి, ఎస్సి, బిసి  అభ్యర్ధులు రూ. 1500 చెల్లించాలని తెలిపా రు. ఈ సమావేశంలో డిఎల్డివో కె శ్రీనివాసులు రెడ్డి ,సీఐ సుబ్రహ్మణ్యం ,ఎలక్షన్ అధికారులు, మునిసిపల్ సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ఇంచార్జ్ లు తదితరులు పాల్గొన్నారు.