BREAKING
అనపర్తి నియోజకవర్గంలో వేడెక్కుతున్న రాజకీయం. సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి దర్శనం మండలంలో పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో ఆలమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రతిభ చీరాల వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ ఇస్తర్ల షెర్లి అంబాజీపేట ప్రజలకు అందుబాటులోకి అత్యాధునిక వైద్యం :అశ్విని హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి సుభాష్, ఎమ్మెల్యే గిడ్డి, టీడీపీ ఇంచార్జ్ మోకా బద్వేల్ 9వ వార్డు టీడీపీ అభ్యర్థిగా బెస్తమల సునీల్ గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం యాసంగిలో వరి సాగు తగ్గించండి ఒక అవకాశం ఇస్తే 5వ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నేచురల్ స్టార్ వరకు.. నాని సినీ ప్రయాణంలో నేర్చుకోవాల్సిన పాఠాలు! ఏలూరులో టీడీపీకి భారీ షాక్‌!* *62 మంది క్లస్టర్ ఇన్‌చార్జులు, నాయకులు, కార్యకర్తల మూకుమ్మడి రాజీనామా!* ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటులో జాప్యం.. 100 ఎకరాల వరి పంటకు నీటి కష్టాలు ఓటరు జాబితాల ప్రత్యేక సవరణకు ఈసీ నిర్ణయం హత్య కేసులో భార్యాభర్తలు అరెస్ట్ --స్మార్ట్‌ఫోన్ స్వాధీనం

సారస్ మేళా–2026లో కామారెడ్డి మహిళల విజయం అభినందనీయం

Select Suryaa Now
సారస్ మేళా–2026లో కామారెడ్డి మహిళల విజయం అభినందనీయం
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి ;మహిళల ఆర్థిక స్వావలంబనకు స్వయం సహాయక సంఘాలు, ప్రభుత్వ పథకాలు దోహదం
విజయగాథలు సృష్టిస్తున్న మహిళలను, ప్రోత్సహిస్తున్న సిబ్బందిని అభినందించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ మైదానంలో నిర్వహిస్తున్న సారస్ మేళా–2026లో కామారెడ్డి జిల్లాకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తూ, విక్రయాలు చేపడుతూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.
సారస్ మేళాలో సంప్రదాయ వంటకాలు, పచ్చళ్ళు, చిరుధాన్య ఉత్పత్తులు, గానుగ నూనెలను విక్రయిస్తూ స్వయం ఉపాధితో ఆర్థిక స్వావలంబన సాధిస్తున్న దేవల సరోజ, కే. సుజాత, మోతే సుప్రియ విజయాలను జిల్లా కలెక్టర్ అభినందించారు. మహిళా సంఘాల సభ్యులు తమ నైపుణ్యాలను వ్యాపార అవకాశాలుగా మలుచుకుని ఆదాయం పొందడంతో పాటు ఇతర మహిళలకు ఉపాధి కల్పించడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా అందుతున్న పొదుపు, రుణ సదుపాయాలు, బ్యాంకుల సహకారం, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు. మహిళలు తయారు చేస్తున్న సంప్రదాయ ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించి, మార్కెట్ అవకాశాలను పెంపొందించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని తెలిపారు.సారస్ మేళా వంటి  ప్రదర్శనలు గ్రామీణ మహిళలు తమ ఉత్పత్తులను విస్తృత స్థాయిలో వినియోగదారులకు పరిచయం చేసుకునేందుకు, వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు చక్కని వేదికగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మహిళల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి దోహదం జరుగుతుందని తెలిపారు.సారస్ మేళాలో కామారెడ్డి జిల్లా మహిళలకు అవసరమైన సహకారం అందిస్తూ వారి విజయాలకు తోడ్పడుతున్న సంబంధిత అధికారులు, సిబ్బందిని కూడా జిల్లా కలెక్టర్ అభినందించారు. మహిళా సంఘాల సభ్యులు ఇదే స్ఫూర్తితో మరింత అభివృద్ధి సాధించి, ఇతర మహిళలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో మహిళల విజయాలను, వారికి సహకరిస్తున్న సిబ్బంది కృషిని అభినందించడం ద్వారా మహిళా సాధికారతకు జిల్లా యంత్రాంగం తన ప్రోత్సాహాన్ని తెలియజేసింది.