BREAKING
మండలంలో పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో ఆలమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రతిభ చీరాల వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ ఇస్తర్ల షెర్లి అంబాజీపేట ప్రజలకు అందుబాటులోకి అత్యాధునిక వైద్యం :అశ్విని హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి సుభాష్, ఎమ్మెల్యే గిడ్డి, టీడీపీ ఇంచార్జ్ మోకా బద్వేల్ 9వ వార్డు టీడీపీ అభ్యర్థిగా బెస్తమల సునీల్ గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం యాసంగిలో వరి సాగు తగ్గించండి ఒక అవకాశం ఇస్తే 5వ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నేచురల్ స్టార్ వరకు.. నాని సినీ ప్రయాణంలో నేర్చుకోవాల్సిన పాఠాలు! ఏలూరులో టీడీపీకి భారీ షాక్‌!* *62 మంది క్లస్టర్ ఇన్‌చార్జులు, నాయకులు, కార్యకర్తల మూకుమ్మడి రాజీనామా!* ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటులో జాప్యం.. 100 ఎకరాల వరి పంటకు నీటి కష్టాలు ఓటరు జాబితాల ప్రత్యేక సవరణకు ఈసీ నిర్ణయం హత్య కేసులో భార్యాభర్తలు అరెస్ట్ --స్మార్ట్‌ఫోన్ స్వాధీనం ఆసియా పతక విజేతలతో ప్రధాని మోడీ సమావేశం మేడ్చల్ డిపో TJMU ఘన విజయం.. గౌరవ అధ్యక్షుడిగా జగన్ గౌడ్, సెక్రటరీగా శ్రీనివాస్

వృద్ధాశ్రమంలో పోలీస్ కమిషనర్ సేవా కార్యక్రమం

Select Suryaa Now
వృద్ధాశ్రమంలో పోలీస్ కమిషనర్ సేవా కార్యక్రమం
సూర్య, ఆర్మూర్, :వృద్ధుల పట్ల ఆప్యాయత, మానవీయ విలువలు, సామాజిక బాధ్యతను చాటుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య గురువారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకాపూర్ గ్రామంలో ఉన్న లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడ నివసిస్తున్న సుమారు 60 మంది వృద్ధుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితులు, వ్యక్తిగత సమస్యలు, అవసరాలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ చేసిన పోలీస్ కమిషనర్, స్వయంగా మధ్యాహ్న భోజనం వడ్డించారు. వారితో కొంతసేపు గడుపుతూ వారి అనుభవాలు, ఇబ్బందులను తెలుసుకున్నారు. పోలీస్ కమిషనర్ తమ వద్దకు వచ్చి ఆప్యాయంగా పలకరించడంతో వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు.
 
 వృద్ధుల సంక్షేమం అందరి బాధ్యత
 
వృద్ధులను నిర్లక్ష్యం చేయకుండా వారి అవసరాలను గుర్తించి అండగా నిలవాలని పోలీస్ కమిషనర్ సూచించారు. వృద్ధాప్యంలో శారీరకంగా, మానసికంగా ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు, సమాజం నుంచి ప్రేమ, గౌరవం, సహకారం అవసరమన్నారు. వృద్ధుల సమస్యలను ఓపికగా విని, వారికి తగిన సహాయం అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల జీవన పరిస్థితులను క్షేత్రస్థాయిలో తెలుసుకుంటూ, అవసరమైన వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
 
 వృద్ధులకు వైద్య పరీక్షలు
 
కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ ప్రాంతానికి చెందిన ప్రముఖ వైద్యులు వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. అవసరమైన వైద్య సలహాలు, సూచనలు అందించారు. పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక సేవ, మానవీయ విలువల పెంపునకు కూడా ప్రాధాన్యం ఇస్తోందనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్‌రెడ్డి, భీంగల్ సీఐ సత్యనారాయణగౌడ్, ఆర్మూర్ ఎస్‌హెచ్‌ఓ చంద్రశేఖర్‌రెడ్డి, వైద్యులు డాక్టర్ శంకర్ (పీడియాట్రిక్), డాక్టర్ మధుశేఖర్ (జనరల్ సర్జన్), డాక్టర్ వంశీ (డయాబెటిక్), డాక్టర్ ముత్యంరెడ్డి (జనరల్ సర్జన్), డాక్టర్ లింగారెడ్డి (జనరల్ ఫిజీషియన్), డాక్టర్ ధనపాల్ సదన్ (డెంటల్)తో పాటు వృద్ధాశ్రమ నిర్వాహకులు సునీత, నాగమణి, దామోదర్‌రెడ్డి, సంకీత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.