BREAKING
మండలంలో పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో ఆలమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రతిభ చీరాల వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ ఇస్తర్ల షెర్లి అంబాజీపేట ప్రజలకు అందుబాటులోకి అత్యాధునిక వైద్యం :అశ్విని హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి సుభాష్, ఎమ్మెల్యే గిడ్డి, టీడీపీ ఇంచార్జ్ మోకా బద్వేల్ 9వ వార్డు టీడీపీ అభ్యర్థిగా బెస్తమల సునీల్ గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం యాసంగిలో వరి సాగు తగ్గించండి ఒక అవకాశం ఇస్తే 5వ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నేచురల్ స్టార్ వరకు.. నాని సినీ ప్రయాణంలో నేర్చుకోవాల్సిన పాఠాలు! ఏలూరులో టీడీపీకి భారీ షాక్‌!* *62 మంది క్లస్టర్ ఇన్‌చార్జులు, నాయకులు, కార్యకర్తల మూకుమ్మడి రాజీనామా!* ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటులో జాప్యం.. 100 ఎకరాల వరి పంటకు నీటి కష్టాలు ఓటరు జాబితాల ప్రత్యేక సవరణకు ఈసీ నిర్ణయం హత్య కేసులో భార్యాభర్తలు అరెస్ట్ --స్మార్ట్‌ఫోన్ స్వాధీనం ఆసియా పతక విజేతలతో ప్రధాని మోడీ సమావేశం మేడ్చల్ డిపో TJMU ఘన విజయం.. గౌరవ అధ్యక్షుడిగా జగన్ గౌడ్, సెక్రటరీగా శ్రీనివాస్

చేనేత వస్త్రాల కొనుగోలుతో నేతన్నలకు ప్రోత్సాహం

Select Suryaa Now
చేనేత వస్త్రాల కొనుగోలుతో నేతన్నలకు ప్రోత్సాహం

హైదరాబాద్, మేజర్ న్యూస్‌: చేనేత రంగాన్ని ప్రోత్సహించి నేతన్నలకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పారిశ్రామికవేత్త శ్రీలక్ష్మి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన ‘షీ-2026’ రెండో రోజు గురువారం ఆమె తన స్నేహితులతో కలిసి సందర్శించారు. పటోళ, చందేరి, కంచిపట్టు, సిల్క్‌ చీరలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. మగ్గాలపై నేతన్నలు చేతితో నేసిన నాణ్యమైన చేనేత వస్త్రాలు ఒకే వేదికపై అందుబాటులో ఉండటం సంతోషంగా ఉందన్నారు. మన సంప్రదాయాలను కాపాడుకుంటూ చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడం ద్వారా నేతన్నలకు ఉపాధి కల్పించడంతోపాటు వారి కళకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. చేనేత ఉత్పత్తులకు ఆదరణ పెంచి, ఈ రంగంపై ఆధారపడిన కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని శ్రీలక్ష్మి అభిప్రాయపడ్డారు.