telanagana
రేపు ఐదు 2బీ బార్లకు లాటరీ:జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఆర్. ప్రవీణ్
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఐదు 2బీ మద్యం బార్ల కేటాయింపునకు శుక్రవారం (అక్టోబర్ 16) లాటరీ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఆర్. ప్రవీణ్ తెలిపారు. అలియాబాద్లో ఒకటి, మూడుచింతలపల్లిలో రెండు, ఎల్లంపేటలో రెండు బార్ల కేటాయింపునకు జిల్లా కలెక్టర్ సమక్షంలో డ్రా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉదయం 11 గంటలకు లాటరీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆర్. ప్రవీణ్ పేర్కొన్నారు. సంబంధిత బార్లకు దరఖాస్తు చేసుకున్న వారంతా ఉదయం 9 గంటలకే కలెక్టరేట్కు చేరుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం లాటరీ ద్వారా బార్లను కేటాయించనున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారులు సమయపాలన పాటిస్తూ నిర్ణీత సమయానికి హాజరుకావాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఆర్. ప్రవీణ్ స్పష్టం చేశారు.
రిపోర్టర్: బాల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రతినిధి.