BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

రూ.5 లక్షల లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన కీసర డిప్యూటీ తహసీల్దార్‌ సహా ముగ్గురు

Select Suryaa Now
రూ.5 లక్షల లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన కీసర డిప్యూటీ తహసీల్దార్‌ సహా ముగ్గురు

కీసర, అక్టోబర్‌ 15:
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే లంచం ఆరోపణల్లో చిక్కుకోవడం కలకలం రేపుతోంది. భూమి సక్సెషన్‌ ప్రక్రియ పూర్తి చేసేందుకు రూ.5 లక్షలు డిమాండ్‌ చేసి, తొలి విడతగా రూ.2.50 లక్షలు తీసుకుంటుండగా కీసర తహసీల్దార్‌ కార్యాలయానికి చెందిన ముగ్గురు రెవెన్యూ అధికారులు ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. ఈ ఘటన మేడ్చల్‌ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

భూమి సక్సెషన్‌ కోసం కార్యాలయాన్ని ఆశ్రయించిన బాధితుడు

వివరాల్లోకి వెళితే.. కీసరకు చెందిన పన్నాల బుచ్చిరెడ్డి భార్య పన్నాల సుశీల ఇటీవల మృతి చెందారు. ఆమె పేరు మీద సర్వే నంబర్లు 183, 184లో ఉన్న మూడు ఎకరాల భూమికి సక్సెషన్‌ ప్రక్రియ పూర్తి చేసేందుకు పన్నాల గిరిధర్‌రెడ్డి సంబంధిత రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించినట్లు తెలిసింది. అయితే, సదరు భూమి 22-ఏ జాబితాలో ఉందని, సక్సెషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

రూ.5 లక్షలు డిమాండ్‌.. తొలి విడతగా రూ.2.50 లక్షలు

ఏసీబీ డీసీపీ ఆనంద్‌కుమార్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. సక్సెషన్‌ ప్రక్రియ పూర్తి చేసేందుకు కీసర డిప్యూటీ తహసీల్దార్‌ సందీప్‌రెడ్డి రూ.5 లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. భూమిని 22-ఏ జాబితా నుంచి తొలగించే ప్రక్రియలో తహసీల్దార్‌తో పాటు ఆర్డీఓ కార్యాలయంలోనూ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని బాధితుడికి చెప్పినట్లు సమాచారం. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచనల మేరకు నగదు అందజేసే సమయంలో అధికారులు నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

నగదు చేతులు మారుతుండగా ఏసీబీ దాడి

బాధితుడు తొలి విడతగా రూ.2.50 లక్షలను కీసర ఎంఆర్ఓ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌ విజయ్‌కుమార్‌రెడ్డికి అందజేసినట్లు సమాచారం. అనంతరం ఆయన ఆ నగదును రికార్డు అసిస్టెంట్‌ బాలకృష్ణకు అప్పగించినట్లు తెలిసింది. బాలకృష్ణ ఆ మొత్తాన్ని డిప్యూటీ తహసీల్దార్‌ సందీప్‌రెడ్డి గదిలోకి తీసుకెళ్లి ఆయన బ్యాగులో పెడుతున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనలో డిప్యూటీ తహసీల్దార్‌ సందీప్‌రెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ విజయ్‌కుమార్‌రెడ్డి, రికార్డు అసిస్టెంట్‌ బాలకృష్ణ ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించి అధికారిక ప్రకటన, తదుపరి విచారణ వివరాలు వెలువడాల్సి ఉంది.

ప్రభుత్వ సేవలకు లంచాలా?

సక్సెషన్‌ వంటి కీలకమైన రెవెన్యూ సేవల కోసం లంచం డిమాండ్‌ చేశారనే ఆరోపణలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. భూముల రికార్డులు, వారసత్వ హక్కులకు సంబంధించిన పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలను ఆశ్రయించే సామాన్యులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తే ప్రభుత్వ సేవలపై నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, తప్పు చేసినట్లు తేలిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.