BREAKING
ఎంపిపి, జెడ్పీటీసీ, ఎంపిటిసి ల రిజర్వేషన్ లు ఖరారు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో మరో సినిమా తీయడమే నా చివరి కోరిక.. కరణ్ జోహార్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఎముకల దృఢత్వానికి బీన్స్ చేసే మేలు.. అవసరమైన ముఖ్యమైన పోషకాలు ఇవే! పుల్లలచెరువు మండలంలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ బ్లాక్‌బస్టర్ ది ఒడిస్సీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? చిన్నగంజాం ఎస్‌ఐ సురేష్‌కు ఎమ్మెల్యే ఏలూరి శుభాకాంక్షలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ ఆర్సీ 17 కొత్త ఆఫీస్ పూజా కార్యక్రమాలు పూర్తి! శాంతియుత వాతావరణానికి ప్రజల సహకరించాలి కేటిఆర్ తో మురళీకృష్ణ యాదవ్ మూలాఖాత్ కిరాతక భార్య, ప్రియులకు ఉరిశిక్ష ట్యాంకర్ల నీటితో వరి పంటను కాపాడుకుంటున్న రైతు జాతీయ స్థాయి క్రీడలకు ఆర్ కె విద్యార్థిని ఎంపిక బెజ్జుర్‌లో భక్తిశ్రద్ధలతో నాలుగో రోజు పూజలు - అన్నదాన వితరణ 4వ రోజుకు చేరిన సాయిబాబా ఆరాధన ఉత్సవాలు నెల్లూరు నగరంలో దూకుడు పెంచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..

వాల్మీకిలను సత్వరమే ఎస్టీ జాబితాలో చేర్చాలి

Select Suryaa Now
వాల్మీకిలను సత్వరమే ఎస్టీ జాబితాలో చేర్చాలి


- వాల్మీకి జయంతిని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలి
- విఆర్ఎస్ఎస్ అధ్యక్షులు పొదల నరసింహులు డిమాండ్
మదనపల్లె,మేజర్ న్యూస్ : ఈనెల 26వ తేదిన జరిగే వాల్మీకి జయంతి వేడుకను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించి ఐక్యతను చాటి చెప్పేందుకు సన్నద్ధం అవు తున్నట్లు వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పొదల నరసింహులు ప్రకటించారు.బుధవారం మదనపల్లె పట్టణం బేబీ వెల్కం హోం నందు వాల్మీకి శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకుల చిరకాల స్వప్నం ఎస్టి జాబితాతో చేర్చడంతోపాటు,వాల్మీకి జయంతి రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడిచిపోయిన ఇప్పటి వరకు వాల్మీకులకు ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చలేదని పేర్కొన్నారు.ఈనెల 26న జరిగే వాల్మీకి జయంతి వేడుకలను అన్ని వాల్మీకి సంఘాలతో సమన్వయం చేసుకొని ఘనంగా నిర్వహించడంతోపాటు ఐక్యతను చాటిచెబుతూ ప్రభుత్వానికి తమ గళాన్ని వినిపిస్తామని ప్రకటించారు.ఇప్పటికే గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు మహిళల నుంచి విద్యార్థి,యువత వరకు వాల్మీకి రిజర్వేషన్ సాధించుకోవడంపై చైతన్యం పెరిగిందని గుర్తుచేశారు.వాల్మీకి జయంతి రోజు పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమం,వాల్మీకి మహర్షికి ప్రత్యేక పూజలు ప్రత్యేక చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నామని,కావున వాల్మీకి కుటుంబ సభ్యులంతా పెద్దఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా విఆర్ఎస్ఎస్ రాష్ట్ర కోశాధికారిగా డాక్టర్ దేవరింటి సుధాకర్,అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా మంజునాథ్ లను ఎంపిక చేసి నియామక పత్రాలను అందజేశారు.అలాగే వారిని శాలువ,గజమాలతో సన్మానించి,వాల్మీకి రిజర్వేషన్ సాధన కోసం,వాల్మీకి జాతి అభ్యున్నతి కోసం కార్యోన్ముఖులు కావాలని ఆకాంక్షించారు.అనంతరం వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర కోశాధికారిగా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ డి.సుధాకర్ మాట్లాడుతూ తమపై విశ్వాసంతో రాష్ట్ర కోశాధికారిగా బాధ్యతలు అప్పగించిన విఆర్ఎస్ఎస్ అధ్యక్షులు పొదల నర సింహులుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈనెల 26న జరిగే వాల్మీకి జయంతి కార్య క్రమానికి పెద్దఎత్తున వాల్మీకి కుటుంబ సభ్యులు హాజరై జాతి ఐక్యతను చాటి చెప్పి,ప్రభుత్వానికి తమ వాణిని వినిపించాలని కోరారు.వాల్మీకుల ఎస్టీ జాబితా పునరుద్ధరణ చేసే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.జిల్లా అధ్యక్షులు మంజునాథ్ మాట్లాడుతూ వాల్మీకి కుటుంబ సభ్యులందరూ వాల్మీకి జయంతిని జయప్రదం చేయడంతోపాటు ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని పిలుపు నిచ్చారు.మహిళా నాయకురాలు శోభా నాయుడు మాట్లాడుతూ వాల్మీకి జాతి హక్కులను సాధించుకోవడం కోసం వాల్మీకి మహర్షి జయంతి రోజున ఐక్యతను చాటి చెప్పి ప్రభుత్వానికి తమ గళాన్ని,బలాన్ని వినిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గౌరమ్మ,పట్టణ అధ్యక్షులు టి.గాయత్రి,పట్టణ కార్యదర్శి తలారి గాయత్రి,మహిళా నాయకులు శోభానాయుడు,అరుణ వాల్మీకి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి