గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన బాల త్రిపుర సుందరీ దేవి
సైదాపురం, మేజర్ న్యూస్ : సైదాపురం మండల కేంద్రంలోని బాల త్రిపుర సుందరీ దేవి ఆలయంలో బుధవారం అమ్మవారు గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గాయత్రీ దేవి రూపంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ‘ఓం శక్తి.. త్రిపుర భవాని.. శక్తి స్వరూపిణి’ అంటూ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. గాయత్రీ దేవి అలంకరణకు రామశెట్టి వెంకట ప్రసాద్, శ్రీమతి ప్రమీల ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా జోగిపల్లికి చెందిన ఒగ్గు కిష్టయ్య, కామేశ్వరి, ఆదూరు కిషోర్, హరిత.. టీవీ కృష్ణారావు జ్ఞాపకార్థం భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలో భక్తిపూర్వక వాతావరణం నెలకొంది.