అద్దంకి విద్యుత్తు ఈఈ మస్తాన్ రావుకు SE గా పదోన్నతి
సూర్య న్యూస్ అద్దంకి.;అద్దంకి విద్యుత్ ఈ ఈ నల్లూరి మస్తాన్ రావుకు పదోన్నతి లభించింది. ఆయనను పల్నాడు జిల్లాకు కేటాయిస్తూ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ పుల్లారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అద్దంకి మండలం పేరాయపాలెం గ్రామానికి చెందిన నల్లూరి మస్తాన్ రావు విద్యుత్ శాఖలో సుదీర్ఘంగా 34 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. తన సుదీర్ఘ సర్వీసులో ఏకంగా 12 సంవత్సరాల పాటు అద్దంకి ప్రాంతంలోనే వివిధ హోదాల్లో సేవలు అందించడం విశేషం. ప్రజాసమస్యల పట్ల సానుకూలంగా స్పందించే అధికారిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. తన హయాంలో అద్దంకి పరిధిలో విద్యుత్ శాఖపరమైన అభివృద్ధి పనుల్లో, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని విద్యుత్ శాఖ సిబ్బంది, స్థానికులు కొనియాడారు.