మృతురాలి కుటుంబానికి నాయకుల ఆర్థిక సహాయం
చుక్కాపూర్ గ్రామానికి చెందిన కొప్పు బాలమ్మ ఈనెల 5న మృతి చెందడం జరిగింది. బాలమ్మ మృతి విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న గౌరీ జువెలర్స్ ఏమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆర్ఎన్ఆర్ డెవలపర్స్ ఏమిరెడ్డి పాండురంగారెడ్డి వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు ఏమిరెడ్డి సుదర్శనమ్మ-అల్వాల్ రెడ్డి, ఏమిరెడ్డిభారతమ్మ మాధవరెడ్డి జ్ఞాపకార్థం10వేల రూపాయలు, తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసు శ్రీనివాస్ రెడ్డి 4వేల రూపాయలు, bచుక్కాపూర్ హెల్పింగ్ హాండ్స్ 6వేల 200 రూపాయలను మృతురాలి కుమారులు పర్వతాలు, జగ్గయ్య లకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ దాసరి యాదయ్య, మాజీ ఉప సర్పంచ్ జక్కు శ్రీనివాస్ రెడ్డి, మాజీవార్డు సభ్యులు కాలూరి నరసింహ, కాలూరి రాములు, కొప్పు మల్లేష్, చంద్రకుమార్, కొప్పు యాదయ్య, కాలూరి పోచయ్య, కొప్పు లక్ష్మయ్య, కాలూరి అశోక్, చంద్రయ్య, కిష్టయ్య, రామచంద్రయ్య, లడ్డు యాదయ్య, కాలూరి యాదయ్య, గౌరెల్లి బిక్షపతి, దరువుల జంగయ్య, కొప్పు వీరయ్య, కొప్పు గోపాల్, లక్ష్మయ్య, కాలూరి బాల్ జంగయ్య, కంబాలపల్లి కృష్ణయ్య, పట్నం సిద్దు తదితరులు పాల్గొన్నారు.
- చప్పిడి తిరుపతి, మేజర్ న్యూస్: తలకొండపల్లి.